మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (18:13 IST)

శభాష్ కేసీఆర్.. 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి: రామోజీరావు కితాబు

తెలుగు భాషను తెలంగాణలో తప్పనిసరి చేయడంతో పాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను 12వ త

తెలుగు భాషను తెలంగాణలో తప్పనిసరి చేయడంతో పాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను 12వ తరగతి వరకు తప్పనిసరి చేయడం గొప్ప విషయమని కేసీఆర్‌ను ఆయన కొనియాడారు.

ఇంకా పాలనా వ్యవహరాల్లో తెలుగును అనివార్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు భాషకు గుర్తింపు రావాలంటే, తెలుగు కనుమరుగు కాకుండా వుండాలంటే.. ఇదేవిధంగా ముందుకు సాగాలని.. ఉద్యోగ నియామకాల్లో కూడా తెలుగు ప్రజ్ఞను అనివార్యం చేయాలని సూచించారు. 
 
ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రామోజీ రావు లేఖ రాశారు. ప్రపంచ తెలుగు మహాసభలను తొలిసారి రాష్ట్రంలో నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను మరింత విస్తృతం చేయాలంటే... పరిపాలనా వ్యవహారాల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయాలని రామోజీరావు తన లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేయడం బలమైన నిర్ణయమని ప్రశంసించారు.