ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (12:16 IST)

ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకుల.. అర్థరాత్రి రికార్డు డ్యాన్సులు

record dance party
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. అధికారులతో పాటు పోలీసులు గులాంగిరీ చేస్తుండటంతో తమకు అడ్డూఅదుపు లేదన్న రీతిలో చెలరేగిపోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పుట్టిన రోజు వేడుక అశ్లీల నృత్యాలకు వేదికైంది. 
 
స్థానిక గడియార స్తంభం కూడలిలో ప్రధాన రహదారికి అడ్డంగా వేదిక ఏర్పాటుచేశారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు వైకాపా కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేశారు. 
 
అర్థరాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే కేకు కోసిన అనంతరం ఈ నృత్యాలు సాగినా ఆయన వారించకపోవడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. పైగా పోలీసులు తమకేం తెలియనట్టుగా మిన్నకుండిపోయారు.