Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐజీఎస్టీ బకాయిలు త్వరగా విడుదల చేయండి: మంత్రి బుగ్గన

Written By ఎం
Updated: మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:15 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (వర్చువల్ సమావేశం) ఢిల్లీ నుంచి జరిగింది. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, 2020-21 సంవత్సరంలో రావాల్సిన కాంపెన్సేషన్  బకాయిలలో కొంత విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మిగిలిన ఐజీఎస్టీ బకాయిలు కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంచే విధించి వసూలు చేయబడుతున్న సెస్సులు, సర్ ఛార్జీలు, డివిజబుల్ పూల్ లేనందువల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గి ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు పట్ల కేంద్రంగా ఉదారంగా వ్యవహరించాలని కోరారు.

కౌన్సిల్ సమావేశంలో ప్రాముఖ్యత ఉన్న అంశాలను అంగీకారం తెలుపుతూ వాటికి సరైన విధాన రూపకల్పన చేయాలని సూచించారు. కాంపెన్సేషన్ విషయంలో ఏకాభిప్రాయం కొరకు మరిన్ని సమావేశాలు, లోతైన అధ్యయనం జరగాలని తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులతో పాటు ప్రస్తుతం కొవిడ్ వల్ల ప్రజారోగ్యం మీద అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుండడంతో రాష్ట్రాల వనరులపై అదనపు భారం పడుతోందని చెబుతూ, ప్రస్తుత క్లిష్ట సమయంలో కేంద్రం వెంటనే అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments