శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (15:45 IST)

హైకోర్టు సీరియస్.. దిగొచ్చిన జగన్ సర్కారు.. పార్టీ రంగులు తొలగించి..?

హైకోర్టు ఆగ్రహానికి జగన్ ప్రభుత్వం దిగొచ్చింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్టు హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది ప్రభుత్వం. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయబోమంటూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది హైకోర్టులో ప్రమాణపత్రం ఇచ్చారు.
 
ఏపీలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ బైభీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 
 
తక్షణమే పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గత నెలలో ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది.