శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (16:25 IST)

కందుకూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు కేసు నమోదు చేయాలి: మంత్రి రోజా

rk roja
నెల్లూరు జిల్లా కుందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోయిన ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బాధ్యుడిగా చేస్తూ కేసు నమోదు చేయాలని ఏపీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. 
 
బుధవారం రాత్రి కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో సభలో తొక్కిసలాట జరిగి ఎనిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మంత్రి రోజా స్పందిస్తూ, పబ్లిసిటీ పిచ్చింతో ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు. 
 
అందువల్ల చంద్రబాబుపై కోర్టులే సుమోటాగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ.2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరును ప్రకటించిన రోజే 8 మంది ప్రాణాలు హరించారని ఆమె వ్యాఖ్యానించారు.