శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (17:06 IST)

ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కా చెల్లెళ్లు.. ఎక్కడ?

marriage
మహారాష్ట్రకు చెందిన కవలైన అక్కా చెల్లెళ్ళు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ అక్కా చెల్లెళ్ళుగా పుట్టడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో జరిగింది. ఈ కవల అక్కాచెల్లెళ్ళ వయసు 36 యేళ్లు. పైగా, వీరిద్దరూ ముంబైలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం తమ తండ్రి మరణించడంత ప్రస్తుతం వారిద్దరూ తమ తల్లితో కలిసి ఉంటున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి ఈ పెళ్లి తంతు ముగిసింది. 
 
ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెలిద్దరూ కలిసి వరుడికి ఒకే పూలదండ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వరుడిపై బహుభార్యత్వం కేసును నమోదు చేశారు.