బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 14 అక్టోబరు 2020 (23:09 IST)

మళ్ళీ ఆంబులెన్సును నడిపిన రోజా...

ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా ఏది చేసినా సంచలనమే. ఫైర్ బ్రాండ్‌గా ఉంటూ ప్రజల మధ్య ప్రజాప్రతినిధిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు రోజా. తాజాగా జీటీవీ తెలుగు ఛానల్ యాజమాన్యం 10 ఆంబులెన్స్‌లను ఇచ్చారు.
 
ప్రభుత్వానికి వీటిని ఉచితంగా ఇవ్వడంతో ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే నగరిలో ప్రభుత్వ ఆంబులెన్స్‌లను స్వయంగా నడిపిన రోజా... ఈ ఆంబులెన్స్‌లను కూడా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 
 
ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతోందన్న నమ్మకం ప్రజల్లో ఉందని.. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారన్నారు.