ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 9 నవంబరు 2020 (22:19 IST)

అయ్యా జూమ్ బాబుగారు.. మీకుందా..? రోజా ప్రశ్న

రాష్ట్రం సంక్షేమం, అభివృద్థి వైపు పరుగులు పెడుతోంది. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. 17 నెలలు అద్భుతమైన పాలన అంటూ జనమే మెచ్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్ళినా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
 
ఇదంతా చూస్తున్న చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. అయ్యా.. ప్రతిపక్షనేత గారు. మీరు జూమ్ యాప్‌లో మాట్లాడటం కాదు. అసలు మీకు కాస్తయినా ప్రజలపైన మమకారం వుంటే జనంలోకి రండి అంటూ సవాల్ విసిరారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా. 
 
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సంధ్భరంగా చిత్తూరు జిల్లా నగరిలో రోజా వైసిపి కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. నగరి పట్టణంలో ర్యాలీ కొనసాగింది. అడుగడుగునా రోజాకు జనం నీరాజనాలు పలికారు.