మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (21:07 IST)

గంటకు 3 వేలు, ఇదే నా అడ్రస్ అంటూ భార్య ఫోన్ నుంచి శాడిస్ట్ భర్త వాట్సప్ మెసేజ్

ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. పెళ్ళయి నాలుగు నెలలే అవుతోంది. అయితే కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. అతను టిటిడి ఉద్యోగి. బాగా సంపాదిస్తున్నాడు. అయినా డబ్బు డబ్బు.. ఇదే పిచ్చి. దీంతో కట్టుకున్న భార్యను కార్ల్ గర్ల్‌గా మార్చేందుకు సిద్థమయ్యాడు. ఏకంగా తన భార్య గంటకు 3 వేలు అంటూ బేరం పెట్టాడు.
 
తిరుపతి రూరల్ తిమ్మిడినాయుడు పాళెం ప్రాంతం. రేవంత్, నిరోషాలకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. టిటిడిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో 10 లక్షల నగదు, 10 లక్షల రూపాయల విలువ చేసే నగలును ఇచ్చారు. అయితే ఇంత ఇచ్చినా డబ్బు పిచ్చి మాత్రం అతనికి తగ్గలేదు.
 
పెళ్ళయిన నెల నుంచి కూడా అదనపు కట్నం తీసుకురమ్మంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో నిరోషా ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళింది. ఆ తరువాత నిరోషా కుటుంబ సభ్యులు సర్దిచెప్పి మళ్ళీ పంపించారు. కానీ గత రెండురోజుల నుంచి భార్యాభర్తల మధ్య ఇదే విషయంపై గొడవ జరిగింది.
 
దీంతో భర్త తన భార్య ఫోన్ తీసుకుని అందులో నుంచి గంటకు 3 వేలు, ఇదే నా అడ్రస్ అంటూ కాల్ గర్ల్ అంటూ మెసేజ్‌లు పంపాడు. దీంతో వాట్సాప్ గ్రూపులోని చాలామంది ఫోన్లు చేయడం ప్రారంభించారు. కొంతమంది ఏకంగా ఇంటికే వచ్చేశారు. దీంతో షాక్ తిన్న నిరోషా అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండిపోయింది. వాట్సాప్ మెసేజ్ చూసి నివ్వెరపోయింది. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.