శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (15:58 IST)

మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే వెళ్లాడు, శవమయ్యాడు: సుబ్బయ్య భార్య ఆరోపణ

కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన తెదేపా నేత సుబ్బయ్య హత్యపై ఆయన భార్య అపరాజిత పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన భర్తకు మునిసిపల్ కమిషనర్ ఫోన్ చేస్తేనే వెళ్లారనీ, ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యారని చెప్పారు.
 
ఫిర్యాదులో తను ఇచ్చిన పేర్లను పోలీసులు మార్చారంటూ ఆమె ఆరోపించారు. అసలు తన భర్త మొబైల్ ఫోన్ ఏమయ్యిందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేసారు. కాగా సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద సుబ్బయ్యను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.