Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రాష్ట్రంలో ఇసుక దొంగలు

Written By ఎం
Updated: శనివారం, 26 అక్టోబరు 2019 (10:55 IST)
"కార్మికుల ఆకలి మంటల్లో జగన్ ప్రభుత్వం కాలిపోక తప్పదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దొంగలు పడ్డారు.. భవన నిర్మాణ కార్మికుల కడుపు మండుతోంది..

ఇసుక లేక తాపీ మేస్త్రీ పనులు ఆపేశారు.. కార్మికుల ఆకలి మంటల్లో జగన్ ప్రభుత్వం కాలిపోక తప్పదు.. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా సరఫరా చేశాం.. చేతకాని ప్రభుత్వం కర్షక కార్మికుల పొట్ట కొడుతోంది" అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని గాటుగా విమర్శించారు. 

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద  రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించిన వైసీపీ ప్రభుత్వంపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం తమ నాయకులు, కార్యకర్తలకు దొడ్డిదారిన సంపాదించి పెట్టెలా పాలసీ అమలు చేస్తున్నారు అని ఆరోపించారు.

ఇసుకాసురుల భరతం పట్టాల్సిన అధికారులు దగ్గరుండి మరీ అక్రమ ఇసుక రవాణాలను ప్రోత్సహిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇసుక కొరత లేకుండా చేసి అందరికీ అందు బాటులోకి తెచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments