శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (12:46 IST)

అమ్మాయిలను అదోలా చూసినా అంతే సంగతులు..

మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన

మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికురాలిని చూపులతో చూస్తూ.. ఇబ్బంది పెట్టిన ఓ ఆటో డ్రైవర్‌ను షీ-టీమ్‌ అరెస్టు చేసింది. ఇతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్‌ తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ మెహిదీపట్నంలో పనిచేస్తోంది. గత నెల 25న ఈమె తన కార్యాలయం నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరింది. డ్రైవర్‌ మహ్మద్‌ మొహినుద్దీన్‌ ఆటోలో ఉన్న అద్దాన్ని తిప్పుతూ మహిళను చూడసాగాడు. 
 
ఈ వ్యవహారంపై బాధితురాలు  షీ- టీమ్స్‌కు ఫిర్యాదు చేయగా.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మొహినుద్దీన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ 14 రోజుల జైలు శిక్ష విధించారు.