గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వైకాపాకు తొత్తులుగా వ్యవహించే పోలీసులపై కఠిన చర్యలు : నారా లోకేశ్

nara lokesh
మరో రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార వైకాపాకు తొత్తులుగా మారి, టీడీపీ కార్యకర్తలు, నేతలను వేధిస్తున్న ఎస్ఐ శ్రీహరి వంటి పోలీసులు, పోలీస్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లా తొండపిలో ఆదివారం రాత్రి తమ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణపై జరిగిన హత్యాయత్న దాడిపై లోకేశ్ స్పందించారు. పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం సాగుతుందన్నారు. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొందరు పోలీసులు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలపై మారణహోం కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. వైకాపాలో చేరాలని లేకపోపోతే రూ.2 లక్షల కప్పం కట్టాలని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
మాచర్ల నియోజకవర్గంలో ఎస్.ఐ శ్రీవరి వేధింపులు భరించలేక టీడీపీ సానుభూతిపరుడు దుర్గారావు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దుర్గారావుపై తప్పుడు కేసు పెట్టి, పార్టీ మారాలని వేధించారని, ఈ వేధింపులు భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ కుటుంబాలనికి టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. 
 
ఎస్ఐ శ్రీహరి వంటి పోలీసులు రాబోయే రోజుల్లో కఠిన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఏపీలో ఉన్న విపరీత పోకడలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని విమర్శించారు. మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఆ తర్వాత ఏర్పాటయ్యే టీడీప - జనసేన ప్రభుత్వంలో వైకాపాకు తొత్తులుగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.