బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (20:33 IST)

గల్లా జయదేవ్‌ది తాత్కాలిక విరామమే... ఆయన కోసం ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉంటాయి...

nara lokesh
టీడీపీ పార్టీ సీనియర్ నేత, గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. పైగా, గుంటూరు ప్రజలకు ఆయన ఆత్మీయ విందు ఇచ్చారు. ఇందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొని ప్రసంగిస్తూ, గల్లా జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని చెప్పారు. ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వెల్లడించారు. మంచి వ్యక్తిత్వానికి మారుపేరు జయదేవ్ అని అన్నారు. 
 
ముఖ్యంగా, సిద్ధాంతాల కోసం నిలబడే వ్యక్తి నేను. రాజీయాల నుంచి తప్పుకుంటానే గానీ పార్టీ మారేది లదేు అని జయదేవ్ కరాఖండిగా చెప్పారు. ఇవాళ నిజంగా ఎంతో బాధపడుతున్నా. ఇంత దగ్గరయ్యామే.. ఎఁదుకు రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నారు అని అనుకుంటే విచారం కలిగింది. ఖచ్చితంగా జయదేవ్‌ను రాజకీయంగా కోల్పోతున్నాం. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అనే అంశంపై ఆయన మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు అని చెప్పారు.