సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:45 IST)

తండ్రి పింఛన్ డబ్బు ఇవ్వలేదని తలపై బండరాయితో మోదాడు

అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. పింఛన్ డబ్బులివ్వలేదని తండ్రినే చంపాడో కసాయి కుమారుడు. కూడేరు మండలం కళగల్లుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తి డబ్బులు కావాలంటూ తండ్రిని సతాయించేవాడు.

ఈ క్రమంలో ఈనెల పింఛను డబ్బులు రాగానే మరోసారి డబ్బులు కావాలంటూ తండ్రిని అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో బండరాయితో మోది చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.