ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (11:57 IST)

పుంగనూరు చంద్రబాబు పర్యటన.. బీర్ బాటిల్స్, కర్రలు, రాళ్ళతో...

pawan - babu
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు పర్యటన, కార్యక్రమం ప్రకారం పుంగనూరులోనికి రావడానికి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. 
 
వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. వారు మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం పుంగనూరులోనికి రాకుండా హైవేపైనే కార్యక్రమం ముగించుకుని చిత్తూరుకు వెళ్ళాల్సి ఉంది అని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. 
 
పోలీసుల నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా కొంతమంది అల్లరి మూకలు దౌర్జన్యంగా పుంగనూరులోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. శాంతిభద్రతల దృష్ట్యా వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో కొంతమంది అల్లరిమూకలు ముందుగానే తెచ్చుకున్న బీర్ బాటిల్స్, కర్రలు, రాళ్ళతో పోలీసుల పైకి దాడికి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. సుమారు 2000 మంది అల్లరి మూకలు చాల అమానవీయంగా దాడి చేశారు.