గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (13:55 IST)

మే నాటికి వైద్య, ఆరోగ్యశాఖలో సిబ్బంది నియమాకం: సీఎం

ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య కార్డుల జారీపై సీఎం సమీక్షించారు. జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

నాడు - నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణంపై చర్చించిన ఆయన.. రాష్ట్రాన్ని 5 జోన్లుగా మార్చి సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు.

3 ప్రాంతాల్లోనూ మెడికల్ వర్సిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్న సీఎం.. మే నాటికి వైద్య, ఆరోగ్యశాఖలో సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. 9 చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయన్న అధికారులు.. 4, 5 ఆస్పత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదన అమలు చేయవచ్చని ముఖ్యమంత్రికి తెలిపారు.

మూడో విడత కంటి వెలుగు ఈ నెల 17 నుంచి మూడోవిడత కంటివెలుగు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు చేయాలని అధికారుల అంచనా వేస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమాన్ని కర్నూలులో సీఎం ప్రారంభించనున్నారు. అదే రోజు సబ్‌సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నారు. 
 
మధుమేహం, బీపీ, క్యాన్సర్, టీబీ, లెప్రసీకి ఏప్రిల్ 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 1.63 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. హైదరాబాద్‌ 72, చెన్నై 23, బెంగళూరులో 35 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కాగా మార్చి 15 నాటికి అందరికీ హెల్త్‌కార్డులు అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. సదరం సెంటర్లను 52 నుంచి 167కు పెంచాలని సమావేశంలో నిర్ణయించారు.