గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 మే 2020 (10:35 IST)

మద్యం అమ్మకాలు నిలిపివేయాలి: మహిళా సంఘం నిరసన

మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా ప్రబలకుండా ఉండాలంటే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మద్యపానం నిషేధం అన్న ముఖ్యమంత్రి ఈ సమయంలో నిషేధం చేయాలని కోరారు.

మద్యం అమ్మకాలు కారణంగా మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం ఉందని, ఇంతే కాక పనులు లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో  మద్యం అమ్మకాలు పేదల కుటుంబాల్లో చిచ్చు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.