గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 మే 2020 (21:03 IST)

టీటీడీ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి స్వరూపానందేంద్ర స్వామి కీలక సూచనలు

టీటీడీ  భూముల విక్రయం పై ఏపీ ప్రభుత్వ పెద్దలతో  పాటు  టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవోలతో శ్రీ స్వరూపానందేంద్ర స్వామి కీలక మంతనాలు చేశారు.

టిటీడీ వ్యవహారంలో వివాదాలకు తావు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి  శ్రీస్వరూపానంద స్వామి సూచన చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందని.. వారి మనోభావాలను గౌరవించే విధంగా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకోవడం మంచిదని స్వరూపానంద స్వామి టీటీడీ పాలక మండలి కి స్పష్టం చేశారు.

టీటీడీ భూముల విక్రయం విషయంలో వివాదాలకు తెరదించే విధంగా నిర్ణయం తీసుకోవడమే మేలని అభిప్రాయపడిన శ్రీ. స్వరూపానందేంద్ర స్వామి.. కరోనా మహమ్మారి కారణంగా మూడు నెలల తర్వాత మళ్లీ శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచన చేశారు.