గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (11:50 IST)

పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ సాధించింది. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేతకు అద్దంపట్టింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహ రచనకు దిగారు. 
 
ఇందులోభాగంగా, ఆయన తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో శుక్రవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఛలో విజయవాడ కార్యక్రమంతో పాటు.. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, తాజా రాజకీయ పరిణామలపై చర్చిస్తున్నారు. 
 
అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా పార్టీ నేతలతో సుధీర్ఘ చర్చ జరుపనున్నారు. ఆ తర్వాత పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను ఖరారు చేసేలా దిశానిర్దేశం చేస్తారు. ఈ భేటీ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుంది.