శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (16:56 IST)

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

Boomerang title, first look launched by Victory Venkatesh
Boomerang title, first look launched by Victory Venkatesh
పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది. ఈ చిత్రం బూమరాంగ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు.
 
'బూమరాంగ్' టైటిల్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం కర్మ ఇతివృత్తాన్ని రెండు సమాంతర కథాంశాలతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది. ఈ టెర్రిఫిక్ ఫస్ట్ లుక్ లో అను ఇమ్మాన్యుయేల్ షాక్ స్థితిలో, ఆమె తల నుండి రక్తం కారుతూ, క్రిమినల్ మాన్షన్ లో వెంబడిస్తున్నట్లు చూపిస్తుంది. ఈ చిల్లింగ్ ఎట్మాస్పియర్ కుక్కలు, నిర్జీవ శరీరాల ప్రజెన్స్ మరింత ఉత్కంఠను పెంచుతుంది.
 
లండన్‌లోని బ్రెత్ టేకింగ్ ప్రదేశాలలో చిత్రీకరించబడిన బూమరాంగ్, ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ కూడా అందిస్తున్నారు, అనుప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్, DRK కిరణ్ ఆర్ట్ డైరెక్టర్‌.