1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:17 IST)

నవ్యాంధ్ర ప్రజలను ఫూల్స్ చేసిన సీఎం జగన్ : నారా లోకేష్

నవ్యాంధ్ర ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపింంచారు. ఎన్నికల హామీల అమలు విషయంలో ప్రజలను జగన్ ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ ఎద్దేవా చేశారు. 
 
జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు, మధ్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్న బియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని లోకేష్ గుర్తుచేశారు. 
 
కాగా, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వైకాపా ప్రభుత్వం భారీగా విద్యుత్ చార్జీలను పెంచింది. గతంలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని రంకెలు వేస్తూ ప్రకటనలు చేసిన జగన్.. ఇపుడు మమడ తిప్పి విద్యుత్ చార్జీల బాదుడుకు తెరలేపారని ఆయన ఆరోపించారు.