శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (18:17 IST)

ఏపీ సీఎం జగన్‌కు పిచ్చి బాగా ముదిరింది.. అన్నీ తుగ్లక్ నిర్ణయాలే?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరిందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. 
 
ఉగాది కానుకగా పేద, మధ్య తరగతిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని ఇది పెను భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏడు సార్లు పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు. 
 
ఇక, విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పేదవారిపై రూ. 1,400 కోట్ల భారం పడనుందన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కవ పెట్రోల్ ధరలున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఆయన అన్నారు.
 
విద్యుత్ ఛార్జీల పెంపు నుంచి చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసిన ఘనుడు జగన్ రెడ్డి… ఇవన్నీ జగన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలే అంటూ మండిపడ్డారు.