బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (11:11 IST)

టీడీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతి

satrucharla chandra sekhar raju
satrucharla chandra sekhar raju
టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ప్రాణాలు కోల్పోయారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
శత్రుచర్ల మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. శత్రుచర్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
 
గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 1989 నుంచి 1994 వరకు బాధ్యతలను నిర్వర్తించారు. 
 
వైసీపీ ఆవిర్భవించిన తర్వాత శత్రుచర్ల ఆ పార్టీలో చేరి, కీలక నేతగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత... వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 
 
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు చంద్రశేఖర్ రాజు సోదరుడు అవుతారు. అంతేకాదు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి స్వయానా మామయ్య అవుతారు.