శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (13:16 IST)

అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు

టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం శాసనమండలిలో ఈలలు వేసి గోల గోల చేశారు. అంతేగాకుండా బుధవారం అసెంబ్లీలోకి చిడతలు తీసుకొచ్చి వాయించారు. స్పీకర్ తమ్మినేని వారిస్తున్నప్పటికీ తీరు మార్చకుండా అలానే వ్యవహరించారు.
 
వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మాట్లాడుతోన్న సందర్భంలో చిడతలు కొడుతూ టీడీపీ సభ్యులు భజన చేశారు. వారి వైఖరిపై ఆగ్రహానికి గురైన స్పీకర్.. సభలో ఈ విధంగా వ్యవహరించడం కరెక్టేనా అంటూ స్పీకర్ మండిపడ్డారు. వారి చేతుల్లో నుంచి చిడతలు తీసుకోవాల్సింది ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బంది వాటిని తీసేసుకున్నారు.
 
ఆ తర్వాత చివరకు మీరంతా చంద్రబాబుకు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ మంత్రి వెలంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.