సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (11:53 IST)

టెక్కీ అనుమానాస్పద మృతి.. ఆ రిపోర్ట్ వస్తేనే ఏం జరిగిందో?

ఓ వైపు మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్యా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మైసమ్మగూడలోని కళాశాలలో ఇంజినీరింగ్‌ సివిల్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక అనే యువతి మంగళవారం శవమై కనిపించింది. అయితే, చంద్రిక స్థానికంగా ఉన్న కృప వసతి గృహంలో ఉంటోంది. 
 
అదే భవనం నుంచి దూకి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్‌ డీసీపీ పద్మజ, బషీర్‌భాగ్‌ ఏసీపీ రామలింగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి స్వస్థలం మిర్యాలగూడ. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ను బట్టి మృతికి సంబంధించి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.