సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 12 జులై 2018 (09:30 IST)

దారుణం... పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి... ఎక్కడ?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్ల

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడుపోసుకునే పసికందులకు రక్షణ లేకుండా పోయింది.
 
తాజాగా అపుడు పుట్టి ప్రాణాలు కోల్పోయిన ఓ పసికందు మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి. ఈ దారుణం దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 
 
స్థానిక డోర్నకల్ మండలానికికి చెందిన శాంతి అనే మహిళ ప్రభుత్వ సీకేఎం ఆసుపత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన పసికందు వెంటనే చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందు మృతదేహాన్ని మార్చురీ లేకపోవడంతో డబ్బాపెట్టెలో పెట్టి భద్రపరిచారు. దీంతో ఎలుకలు ఆ పసికందు భౌతికకాయాన్ని పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై పసికందు బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దారుణం బుధవారం జరిగింది.