శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:30 IST)

జనంతో సంబంధంలేని శాఖతో హరీష్ రావు.. ఏం చేస్తారో?

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొత్త ముఖాలు మంత్రి వర్గంలో చేరడం.. పాత మంత్రులకు శాఖలు మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన రెవెన్యూ, ఇరిగేషన్, గనులు భూగర్భ శాఖలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దగ్గరే ఉన్నాయి. అయితే హారీష్ రావు‌కు ఆర్థికశాఖ అప్పగించడం ఇప్పుడు రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. 
 
ఒక వైపు ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావుకు పెద్ద సవాల్‌గానే నిలువనుంది. ఆర్థిక మంత్రిగా శాఖా పరమైన కార్యక్రమాలు పద్దులు, లెక్కలు తప్ప పర్యటనలు, ప్రజలతో సంబంధాలు ఉండే అవకాశాలు చాలా తక్కువుగా ఉంటాయి. పంచాయితీ, సాగునీటిపారుదల శాఖలు కేటాయిస్తే  హారీష్ రావుకు మరింతగా ప్రజల్లో ఉండేవారని హరీష్ రావు వర్గీయలు అభిప్రాయ పడుతున్నారు. 
 
తెలంగాణాలో కేసీఆర్ తర్వాత అత్యంత ప్రజాదరణ హరీష్ రావుకు ఉందని ఇటువంటి తమ నేతకు ఆర్థిక శాఖ కేటాయించడంపైకాస్త ఇబ్బంది పుడతున్నారు హరీష్ రావు అభిమానులు. అయితే హరీష్ రావుకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా సవాల్‌గా తీసుకుని పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని అశాభావం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు అభిమానులు.