శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:42 IST)

తెలంగాణ బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు.. ఆర్థి లోటు రూ.24.08 వేల కోట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, 'అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించినట్టు చెప్పారు. 
 
అలాగే, గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రవృద్ధి రేటు 10.5గా నమోదైంది. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన మూలధన వ్యయం వాటా తక్కువ ఉండేది. సమైక్య పాలన చివరి పదేళ్లలో రూ.54,052 కోట్లుగా ఉంది. గడిచిన ఐదేళ్లలో మూలధన వయ్యం లక్ష 65,165 కోట్లుగా ఉందని వివరించారు. 
 
కాగా, తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొత్తం రూ.1,46,492.3 కోట్లు, ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,077.08 కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లుగా బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నారు. 
 
మరోవైపు, రైతు బంధు కోసం భారీగా నిధులను కేటాయించారు. ఆర్థక కష్టాల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగా, రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు. 
 
ముఖ్యంగా, పంట రుణ మాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నాం. రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137 కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. ఆసరా పెన్షన్ల కోసం రూ.9402 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పెట్టుబడి సాయం ఆరు రెట్లు పెంచినట్టు ఆయన తెలిపారు.