శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (10:45 IST)

ఓర్నీ తస్సారావుల బొడ్డు.. డబ్బు - మద్యం పాయె... కోళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టె..

సాధారణంగా చట్ట వ్యతిరేకంగా జరిగే కోడి పందేలు నిర్వహించే తప్పుడు పోలీసులు దాడి చేసి కోడి పుంజులను తమ వెంట తీసుకువెళ్ళతారు. కానీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్రాయిలర్ కోళ్లను కూడా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. 
 
మెదక్ పట్టణంలో ఓ పార్టీకి చెందిన నాయకులు బుడగ జంగం తమ పార్టీకి కి అనుకూలంగా ఓటు  వేయాలని కాలనీలో కోళ్లను పంపిణీ చేస్తుండగా, పత్యర్థి పార్టీకి చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోళ్ల పంపిణీని అడ్డుకొని, సదరు పార్టీ కి చెందిన నేతలను అదుపులోనికి తీసుకున్నారు. 
 
అటు పిమ్మట కోళ్ల ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికలు అంటే డబ్బు, మద్యం, బిరియాని మాత్రమే కాదు అని సరికొత్తగా కోళ్లను పంపిణీ చేయడంలో ఓటర్లు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎంతైనా ప్రజాస్వామ్య దేశంలో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు కదా.