బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (14:19 IST)

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

rajamouli couples
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళికి అరుదైన గౌరవంతో పాటు ఆహ్వానం కూడా లభించింది. భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచమంతా తన ప్రతిభకు తగిన గుర్తింపును సాధించిన జక్కన్న ఆస్కార్ కలను కూడా సాకారం చేశారు. ఈ చిత్రంలో నాటు నాటు పాటకుగాను అస్కార్ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ సినిమా టీమ్ సభ్యులైన‌ రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ సాబు శరిల్‌లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఇప్పటికే గతేడాది ఆహ్వానం అందుకున్నారు.
 
ఇపుడు రాజమౌళి అయన సతీమణి రమా రాజమౌళి కూడా ఆహ్వానం అందుకోవడం విశేషం. మొత్తం 487 మంది కొత్త సభ్యుల జాబితాని మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ కేటగిరీలో సిద్ధం చేయగా ఇందులో వీరిద్దరికి కూడా అకాడమీ వారు ఆహ్వానం పలికారు. వీరితో పాటు భారత్ నుంచి షబానా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, శీతల్ ఆర్మ, రవి వర్మన్, రీమా దాస్, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు.