ముంజ్యా నటి శర్వారి కి బాహుబలి సత్యరాజ్ కి కనెక్షన్ !
శర్వారి ప్రధాన పాత్రలో నేష్ విజన్ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ముంజ్యా అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో సత్య రాజ్ ప్రముఖ పాత్రను పోషించారు. ఇక బాహుబలితో కట్టప్పగా ఫేమస్ అయిన సత్య రాజ్‌తో పని చేసిన అనుభవం గురించి శర్వారి చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.
ఎస్ఎస్ రాజమౌళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసిన బాహుబలికి వీరాభిమానిని. ఆ మూవీని ఎన్నో సార్లు చూశాను. ఇక ఈ చిత్రంలో కట్టప్పగా చేసిన సత్య రాజ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నానని తెలియడంతో ఎంతో సంతోషించాను.సెట్‌లో మొదటి రోజు నుండి సత్యరాజ్ అంకితభావం, నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను.
సత్యరాజ్ సర్‌ని సెట్‌లో చూడటంతో ప్రతిరోజూ యాక్టింగ్ వర్క్‌షాప్‌కు హాజరైనట్లుగా ఉంది. అతని బహుముఖ ప్రజ్ఞ, సహనం, పరిపూర్ణ ప్రతిభ అన్నిటినీ మించిపోయింది. అది కామిక్ సీన్ అయినా లేదా ఇంటెన్స్ మూమెంట్ అయినా, సత్యరాజ్ సర్ ఎంతో సెటిల్డ్‌గా ప్రతి సన్నివేశానికి జీవం పోశారు. ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉంది. అలాంటి అవకాశం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.
దినేష్ విజన్ సమర్పణలో, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ముంజ్యా చిత్రాన్ని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. 2024 జూన్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.