స్పై థ్రిల్లర్‌లో నటించటంతో నటిగా నా కల నేరవేరింది : నటి శర్వారి
బాలీవుడ్‌లో రూపొందుతోన్న అతి పెద్ద ఫ్రాంచైజీలలో భాగమైన నేటితరం నటిగా బాలీవుడ్ రైజింగ్ స్టార్ శర్వారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దినేష్ విజన్స్ హారర్ కామెడీతో పాటు ఆదిత్య చోప్రా యష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
దినేష్ విజన్ యొక్క హారర్ కామెడీ ఫ్రాంచైజీ ముంజ్యాలో శర్వారి నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ఇండస్ట్రీలో అతి పెద్ద సినీ ప్రముఖులతో నేను భాగం అవుతున్నాను. నాకు అవకాశం కలిగించిన మన దర్శకులు, నిర్మాతలకు దన్యవాదాలు. అయితే ఈ స్థాయికి చేరుకోవటానికి నేను చాలా కష్టపడ్డాను. దినేష్ విజన్ గారి హారర్ కామెడీ యూనివర్స్‌తో పాటు ఆదిత్య చోప్రాగారి యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న స్పై థ్రిల్లర్‌లో నటించటంతో నటిగా నా కల నేరవేరింది. నేను ఇప్పటి వరకు ఓ సినిమానే చేశాను. అయితే న్యూ టాలెంట్‌ను గుర్తించటంలో ఎప్పుడూ ముందుండే ఇండస్ట్రీ నాకు ఇంత మంచి అవకాశాలను కల్పించటంపై నాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది. పెద్ద సంస్థలు చేస్తోన్న ఫ్రాంచైజీల్లో పెద్ద సూపర్‌స్టార్స్ ఉంటారు. ఇలాంటి వాటిలో నేను భాగం కావటం అనేది నేను చేసిన పనికి దొరికిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాను. అన్నారు.
దేశంలోని అగ్ర దర్శకులు, నిర్మాతలు శర్వారిని తమ చిత్రాల్లోకి ఎంపిక చేసుకోవటం అనేది ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించిన దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. శర్వారి నేటి తరానికి చెందిన స్టార్స్‌లో బెస్ట్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. ముంజ్యా చిత్రంతో పాటు యష్‌రాజ్ ఫిల్మ్స్ చేస్తోన్న స్పై యూనివర్స్ చిత్రంతో పాటు మరో మాస్టర్ ఫిల్మ్ మేకర్ నిఖిల్ అద్వానీ సైతం ఆయన తెరకెక్కించబోతున్న వేద చిత్రంలోనూ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శర్వారి స్పందిస్తూ నటనలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన మన నటీనటులంటే నాకెంతో ఇష్టం, గౌరవం. వాళ్లలాగానే నేను కూడా నటిగా మంచి పేరుని సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంత పెద్ద ఫ్రాంచైజీల్లో నేను భాగం కావటం ఆనందంగా ఉంది. అలాగే నాలో నటిగా మరింత బాధ్యతను పెంచింది. వీటి వల్ల ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాను. దీని వల్ల నటిగా నేనింకా మంచి ప్రదర్శనను కనపరచటానికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాను. అలాగే నన్ను నేను నటిగా మెరుగుపరుచుకోవటానికి ఉపయోగపడుతుంది అన్నారు.