శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (17:43 IST)

మున్సి‌పల్స్ ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి ఫైర్

తెలంగాణా ఫైర్ బ్రాండ్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని ప్రచారం చేస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో కేసీఆర్ చాలా ఇబ్బందులకు గురిచేశాడని, పోలీసులను పేరుతో కేసులు పెట్టించివేధించారు. అయినా మీరు నాకు మద్దతుగా నిలబడి నన్ను గెలిపించారని గుర్తుచేశారు. 
 
నేను మాట ఇస్తే తప్పే రకం కాదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసేదేమీ లేదు.. సర్కారు దగ్గర డబ్బులు కూడా లేవు అన్నారు. షాదీముభారక్ కోసం దరఖాస్తు చేసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత డబ్బులు ఇస్తున్నారు అని విమర్శించారు. నేను గరీబులకు ఏటీఎం సెంటర్ లాంటి వాడిని, ఎవరు వచ్చినా వాళ్లకు డబ్బులిస్తా అని, అందువల్ల సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అన్నారు. 
 
నా రాజకీయ జీవితంలో సంగారెడ్డికి 15 సార్లు సీఎంలను తీసుకుని వచ్చాను. టీఆర్ఎస్ నేతలు ఒక్కసారేనా సీఎంను తీసుకవచ్చారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని, అయినా తాను ఎవరికీ భయపడే రకం కాదని, జగ్గారెడ్డి జోలికి వస్తే గల్లికో జగ్గారెడ్డి పుడతారు అని జగ్గారెడ్డి హెచ్చరించారు.