1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (09:04 IST)

చీకటిపై వెలుగు సాధించిన విజయం : తెలుగు సీఎంల దీపావళి శుభాకాంక్షలు

diwali
చీకటిపై వెలుగు సాధించిన విజయం దీపావళి అని, ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు వేర్వేరుగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజల జీవితాల్లో ఆనందకాంతులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. 
 
ఇదే విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకకగా దీపావళి పండుగను జరుపుకుంటారని తెలిపారు. 
 
ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నిండాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలలని అభిలషించారు. 
 
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు.