శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (14:27 IST)

యువతకు భారీ దీపావళి ఆఫర్.. 75వేల మందికి ఆఫర్ లెటర్స్

modi
యువతకు భారీ దీపావళి ఆఫర్ వస్తోంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్‌ ఆఫర్‌ లెటర్స్‌ ఇవ్వనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్ మీటింగ్‌ తర్వాత వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. 
 
ఈ 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ప్రధాని స్పెషల్‌ గిఫ్ట్‌ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో పనిచేస్తారు.