తెలుగు రాష్ట్రాల్లో SBIలో ఖాళీలు.. 175 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ఎస్బీఐలో 1422 సర్కిల్ బేస్‌డ్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 175పోస్టులు ఖాళీలు వున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు సెప్టెంబర్ 30,2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్ 7,2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్ 4,2022వ తేదీన నిర్వహిస్తారు.
హాల్ టికెట్లను నవంబర్ నెలాఖరులో విడుదల చేస్తారు. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.63,840లు జీతంగా చెల్లిస్తారు. మొత్తం 120 మార్కులకు, 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో 2 గంటల సమయంలో పరీక్ష జరుగుతుంది.