సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలిపులి

రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి, రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం తెలంగాణాలోని అనేక ప్రాంతాలతో పాటు ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచన చేస్తున్నారు. 
 
ముఖ్యంగా రానున్న మూడు రోజుల పాటు చలి గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు కుమరం భీం జిల్లాలోని గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ప్రధాన కారణం ఈశాన్య భారత ప్రాంతాల నుంచ రాష్ట్రంవైపు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు ఉధృతంగా గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి వీచే శీతల గాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వివరించారు.