హుండీలు నిండిపోయాయి, కానుకలు వేయొద్దన్న వేములవాడ ఆలయ సిబ్బంది
హుండీలు నిండాయని భక్తుల నుంచి కానుకలు తీసుకోని ఘటన వేములవాడ రాజన్న ఆలయంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం గర్భగుడి ఆవరణలోని హండీలు నిండాయని ఆలయాధికారులు భక్తుల నుంచి కానుకలు స్వీకరించలేదు. దాంతో భక్తులు తమ కానుకలను ఆలయంలో ఎక్కడబడితే అక్కడ సమర్పించారు.
ఆ కానుకలన్నింటిని ఆలయ సిబ్బంది తమ జేబుల్లో నింపుకున్నారు. ఆలయ సిబ్బంది నిర్వాకంతో వేలాది రూపాయల కానుకలు దుర్వినియోగమైనట్లు ఆరోపణపలు వస్తున్నాయి.
కాగా.. ఈ ఘటనపై ఈఓ కృష్ణ ప్రసాద్ స్పందించారు.
బ్యాంక్ సిబ్బంది చిల్లర నాణాలు తీసుకోకపోవడంతోనే హుండీ లెక్కింపు ఆలస్యమైందని.. అందువల్లే హుండీలు నిండిపోయాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. వెంటనే నిండిన హుండీలను ఖాళీ చేయించి.. వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.