Biodata Maker

జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో మూడు కేసులు

Written By ఎం
Updated: శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:44 IST)
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కేసులు వదలడం లేదు. కడప జైలు నుంచి విడుదలైన ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. కడప జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి.. అక్కడ నుంచి భారీ కారు ర్యాలీతో బయలుదేరారు. 
 
అయితే ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ తాడిపత్రి సీఐ దేవేందర్ పట్ల జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించారు. 
 
ఈ ర్యాలీ హెవీ వాహానాలకు మాత్రమే అనుమతి ఉన్న లైన్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న సీఐ దేవేందర్ ఆ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. 
 
దీంతో కాన్వాయ్ దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్‌తో దురుసగా వ్యవహరించారు. నా కారును ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు.
 
ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం కొద్దిసేపు హంగామా సృష్టించారు. ఈ సంఘటనపై విచారణ చేసిన తరువాత అనంతపురం పోలీసులు జేసీపై మూడు సెక్షన్ల కితం కేసులు నమోదు చేశారు. 
 
ఐపీసీ 353 తోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కేసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదు చేశారు పోలీసులు. జైలు నుంచి విడుదలైన 24 గంటలు తిరగక ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో మూడు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి 54 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments