కోవిడ్ -19 కేసుల నిర్వహణ ఎలా?

Corona
corona
ఎం| Last Updated: శుక్రవారం, 10 జులై 2020 (09:56 IST)
కోవిడ్ -19 లక్షణాలు కలిగివున్న వారికి, వైరస్ నిర్ధారణ అయిన వారిని కోవిడ్ కేర్ సెంటర్లు, డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్లు, డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ లో చేర్చిన తర్వాత వారికి ఎలా చికిత్స అందించాలి? కోవిడ్ నిర్ధారణ అయినవారిని పరీక్షించాల్సిన విధానం ఏంటి? కేసుల వర్గీకరణ ఎలా చేయాలి?

తక్కువ మరియు అతితక్కువ లక్షణాలు గల కేసులు, తీవ్రమైన లక్షణాలున్న కేసులను ఎలా గుర్తించాలి? అనే అంశాలకు సంబంధించిన అంశాలపై ఇదివరకే కేంద్ర ఆరోగ్య మరియు కుటంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

కోవిడ్ కేర్ సెంటర్ (గ్రూప్-1 కేసుల కోసం)
1. వైద్యపరంగా తేలికపాటి/ చాలా తేలికపాటి కేసులు/ అనుమానిత కేసులుగా కేటాయించిన కేసులు
2. హాస్టళ్లు, హోటళ్ళు, పాఠశాలలు, స్టేడియంలు, లాడ్జీలు మొదలైన వాటిలో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు (ఫంక్షనల్ హాస్పిటల్స్ గా చివరి ప్రయత్నంలో వాడొచ్చు)
3. అనుమానిత మరియు ధృవీకరించబడిన కేసుల కోసం ప్రత్యేక ప్రాంతాలు తప్పనిసరి
4. అనుమానిత కేసులకు వ్యక్తిగత గదులను అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేయాలి
5. పైన కల్పించిన సదుపాయాలన్నింటినీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్ డెడికేటెడ్ హెల్త్ సెంటర్ లేదా కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్ కు మ్యాప్ చేయాలి
6. తగినంత ఆక్సిజన్ సపోర్ట్ 24 X 7 తో బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ (బిఎస్ఎల్ఎ) అందుబాటులో ఉండాలి
7. ఆయుష్ వైద్యుల నుండి హెచ్ ఆర్ ను నియమించుకోవచ్చు. (శిక్షణ ప్రోటోకాల్‌లు మరియు శిక్షకులు అందుబాటులో ఉన్నారు)

డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్ (గ్రూప్-2 కేసుల కోసం)
1.
క్లినికల్ గా మితంగా కేటాయించిన కేసులు
2.
పూర్తి ఆసుపత్రి లేదా ఒక ఆసుపత్రి బ్లాక్
3. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా నియమించుకోవచ్చు
4. ఆసుపత్రిలో అనుమానిత మరియు ధృవీకరించబడిన కేసులకు ప్రత్యేక ప్రాంతాలు ఉంటాయి
5. ఆస్పత్రిలో సరైన పడకలతోపాటు ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండాలి
6. అలాంటి ప్రతి సదుపాయాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ తో మ్యాప్ చేయాలి
7. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లో ఆక్సిజన్ సపోర్టుతో సురక్షితమైన రవాణా చేసేందుకు వీలుగా ఉండాలి

డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ (గ్రూప్-3 కేసుల కోసం)
1. క్లినికల్ గా తీవ్రంగా కేటాయించిన కేసులను పరిగణించాలి
2. పూర్తి ఆసుపత్రి లేదా ఆసుపత్రిలో ప్రత్యేక బ్లాక్
3. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా నియమించవచ్చు
4. ఆక్సిజన్‌తో కూడిన ఐసియులు, వెంటిలేటర్ మరియు పడకలు ఉండే హాస్పిటల్స్
5. ఆసుపత్రులలో అనుమానిత మరియు ధృవీకరించబడిన కేసులకు ప్రత్యేక ప్రాంతాలు ఉంటాయి

పేషెంట్లను పరీక్షించాల్సిన విధానం
1. రోగులు నేరుగా / రిఫెరల్ ద్వారా / హెల్ప్‌లైన్ ద్వారా వస్తారు
2. జ్వరం క్లినిక్ లను ఎంపిక చేసిన ఆస్పత్రులు / సిహెచ్‌సిలు / యుసిహెచ్‌సిలు, మునిసిపల్ హాస్పిటల్లో ఏర్పాటు చేయాలి
3. తగిన కోవిడ్ ప్రత్యేకమైన సౌకర్యాలకు చికిత్స మరియు రిఫెరల్ కల్పించాలి
4. క్రాస్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి తగినంత స్థలం కేటాయించాలి
5. అక్కడ ఉండే సదుపాయాల కంటే మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి

పేషెంట్స్ (కేసుల) వర్గీకరణ
1. తేలికపాటి మరియు చాలా తేలికపాటి కేసులు
2. మితమైన కేసులు
3. తీవ్రమైన కేసులు

తక్కువ మరియు అతితక్కువ లక్షణాలు గల కేసులు:
1. జ్వరం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కేసులు
2. పేషెంట్లకు డెడికేటెడ్ కోవిడ్ కేర్ సెంటర్లలో వసతి ఉంటుంది
3. పేషెంట్లకు కోవిడ్ 19 పరీక్షలు చేస్తారు. అప్పటి నుంచి
వారు ‘అనుమానిత కేసులు’ విభాగంలోనే ఉంటారు
4. పాజిటివ్ గా తేలిన పేషెంట్లు ‘ధృవీకరించబడిన కేసులు’ విభాగానికి తరలించబడతారు
5. పరీక్షల్లో నెగిటివ్ వస్తే, ఆ పేషెంట్ కి వ్యాధి లక్షణాల చికిత్స చేయడం జరుగుతుంది మరియు పలు సూచలనలు, మందులతో విడుదల చేయడం జరుగుతుంది
6. ఏ పేషెంట్ అయితే మితమైన లేదా తీవ్రమైన కేసుగా నిర్ధారింపబడితే, వారిని డెడికేటెడ్ హయ్యర్ ఫెసిలిటీ సెంటర్లకు మార్చబడుతుంది

మితమైన కేసులు:
1. తీవ్రతలేని న్యుమోనియా లక్షణాలు (ఎస్పీఓ2
90-94శాతం)
2. పైన పేర్కొన్న లక్షణాలతో ఉన్న కేసులను డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్స్ లో చేర్చాలి
3. డిసిహెచ్‌సిలలోని అల్లోపతి వైద్యులు ప్రోటోకాల్స్ ప్రకారం వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు
4. పరీక్షా ఫలితాలు ప్రకటించబడే వరకు ‘అనుమానిత కేసులు’ విభాగంలలోనే
ఉంచబడతాయి
5.
పాజిటివ్ గా తేలిన పేషెంట్లు ‘ధృవీకరించబడిన కేసులు’
విభాగానికి తరలించాలి
6. పరీక్షలు నెగిటివ్ రిపోర్టు వచ్చిన పేషెంట్లను
తదుపరి పర్యవేక్షణ
కోసం నాన్ కోవిడ్ ఆసుపత్రికి తరలించాలి
7. ఏ పేషెంట్ లో అయినా తీవ్రమైన వైరస్
లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కేసు డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ కు మార్చబడుతుంది

తీవ్రమైన లక్షణాలున్న కేసులు:
1. తీవ్ర న్యుమోనియా (రెస్పిరేటర్ రేటు > 30/నిముషాలు మరియు ఎస్పీఓ2
< 90శాతం) లేదా ఎఆర్డీఎస్
లేదా సెప్టిక్ షాక్
2. పైన పేర్కొన్న లక్షణాలతో ఉన్న కేసులను నేరుగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్లో చేర్చాలి
3. పాజిటివ్ గా తేలిన పేషెంట్లు ఐసియులో ఉంటారు మరియు ప్రామాణిక చికిత్స ప్రోటోకాల్ ప్రకారం చికిత్స పొందుతారు

అజాగ్రత్తతో ఐసీయూలో, ఐసొలేషన్ ఉండే కంటే.. జాగ్రత్తతో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం మేలుదీనిపై మరింత చదవండి :