గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 9 జులై 2020 (21:41 IST)

భార్య నిండుగర్భిణి, ఆఫీస్‌లో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ..?

కర్ణాటక జిల్లా బళ్ళారి సమీపంలోని సండూరుకు చెందిన మంజునాథ్‌కు సంవత్సరం క్రితం బెంగుళూరు సిటీకి చెందిన 21 యేళ్ళ అమ్మాయిని ఇచ్చి ఘనంగా వివాహం చేశారు తల్లిదండ్రులు. మంజునాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని మామ ప్రభుత్వ ఉద్యోగి. ఒకే ఒక్క కుమార్తె కావడంతో 25 లక్షలకు పైగా కట్నం ఇచ్చి.. రెండు ఎకరాల పొలం, 30 తులాల బంగారం ఇచ్చి ఘనంగానే పెళ్ళి చేశాడు.
 
వీరి కాపురం ఎంతో సజావుగా సాగింది. హనీమూన్ అని భార్యను గోవాకు తీసుకెళ్ళాడు. భార్యతో బాగా ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం మంజునాథ్ భార్య నిండు గర్భిణి. కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పడిపోయి ప్రస్తుతం మళ్ళీ పుంజుకుంటోంది. తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఒక యువతిని అపాయింట్ చేశాడు మంజునాథ్.
 
అక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. ఆ యువతి మంజునాథ్‌ను వలలో వేసింది. ప్రైవేటు కార్యాలయం కావడంతో ఇద్దరూ ఆఫీస్ లోనే తెగ ఎంజాయ్ చేసేవారు. సరిగ్గా ఇంటికి రాకపోవడంతో ఎప్పుడూ ఆఫీస్‌లోనే ఉన్నానని మంజునాథ్ చెప్పడంతో అతని భార్యకు అనుమానం వచ్చింది. 
 
భర్తకు తెలియకుండా రెండురోజుల క్రితం అతని ఫోన్‌ను చెక్ చేసింది. అందులో ఒక యువతి ఫోటోలు ఉండటం.. అందులోనూ అసభ్యకరంగా ఉండటంతో భర్త మంజునాథ్‌ను నిలదీసింది. భార్యను బుజ్జగించాల్సింది పోయి చితకబాదాడు మంజునాథ్. ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ నిండుగర్భిణిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు.
 
దీంతో బాధితురాలు అతని ఇంటి ముందే ధర్నాకు దిగింది. తల్లిదండ్రులు కూడా మంజునాథ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.