సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (12:06 IST)

బతకనివ్వట్లేదు.. అందుకే చనిపోతున్నాం.. టిక్ టాక్ ప్రేమ జంట

టిక్ టాక్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ.. మంగళగిరికి చెందిన పవన్ కుమార్‌లకు.. టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో... ఆగస్టు మూడో తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
 
ఇల్లు అద్దెకు తీసుకుని కొత్తకాపురం ప్రారంభించారు. ఇదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు. పవన్‌ను వదిలేసి ఇంటికి రావాలని శైలజపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి నుండి శైలజ సెల్ ఫోన్ కూడ వాడటం మానేసింది. ఆ తరువాత పవన్ కుమార్‌కు.. శైలజ బందువులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు.
 
కలసి బతకలేని స్థితి ఏర్పడిందని భావించిన శైలజ దంపతులు... చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు శైలజ... సూసైడ్ లెటర్ రాసింది.
 
తల్లి హేమలత, తండ్రి రవీంద్రతో పాటుగా బంధువు సుబ్రహ్మణ్యం పేరును శైలజ ప్రస్తావించింది. తమ చావుకు ఈ ముగ్గురే కారణమని లిఖిత పూర్వకంగా తెలిపింది. కేసు నమోదు చేసిన బెల్లంకొండ పోలీసులు.... మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.