శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (20:06 IST)

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

tirupati laddu
తిరుపతి శ్రీవారి లడ్డూలో చేప నూనె, బీఫ్ టాలో, పంది కొవ్వును వినియోగించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారించింది. శ్రీవారి లడ్డూను జూలై 8వ తేదీన టెస్టు నిమిత్తం ల్యాబ్‌కు పంపించగా, ఈ నెల 17వ తేదీన నివేదిక అందజేసింది. 
 
ఈ నివేదికలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గంజలు, చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు వినియోగించినట్టు నివేదికలో పేర్కొంది. నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యతను పాటించలేదని స్పష్టం చేసింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి వాడారాని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి కూడా ఆధారాలతో సహా నిరూపించిన విషయం తెల్సిందే. 
 
శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో వైకాపా ప్రభుత్వం జంతువుల కొవ్వును వినియోగించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గంలో ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెల్సిందే.