శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (10:55 IST)

2019 ఎన్నికల తర్వాత మా బాస్ కేసీఆరే ప్రధాని కావొచ్చు: జితేందర్ రెడ్డి

దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై థర్డ్ ఫ్రంట్ దిశగా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. 2019 ఎన్నికల తర్వాత ఏమైనా జరుగవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేంద

దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై థర్డ్ ఫ్రంట్ దిశగా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. 2019 ఎన్నికల తర్వాత ఏమైనా జరుగవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల తర్వాత తెరాస చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావచ్చునని.. దేశాన్ని పరిపాలించవచ్చునని జితేందర్ రెడ్డి అన్నారు. 
 
ఓ ఇంటర్వ్యూలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి పెరిగిందనే వార్తలను కొట్టిపారేశారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం వుందని తెలిపారు. ఇక దేశ రాజీకయాల్లో థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడారు.
 
బీజేపీతో పోస్ట్ అలయన్స్ కావచ్చు. మా బాసే ప్రధాని అయినా కావచ్చునని జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తామే దేశాన్ని పరిపాలించవచ్చునని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.