1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (10:53 IST)

తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి

chandramouli
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతి చెందారు. గత ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిని బుధవారం వైద్యులు ధృవీకరించారు. 
 
తాగా, చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థమైంది. వచ్చే నెలలో వీరి వివాహం జరగాల్సివుంది. ఈ వివాహం కోసం రెండు కుటుంబాలు శుభలేఖలు పంచుతున్నాయి. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే ఆయనకు గుండె నొప్పిగా ఉండటంతో పక్కనే ఉన్న తన స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.