శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (15:12 IST)

ఎల్‌కేజీ పసిపాపపై ఇద్దరు మైనర్ల అత్యాచారం.. గాలిపటం ఇస్తామని ఆశచూపి..?

కాకినాడలో ఘోరం జరిగింది. నాలుగేళ్ల పసిపాపపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రేచర్ల పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాలిపటాలు ఎగరేద్దామనే వంకతో ఇద్దరు మైనర్ బాలురు ఒక చిన్నారిని మేడపైకి తీసుకెళ్లారు. అనంతరం అభంశుభం తెలియని ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
అత్యాచారానికి తర్వాత ఆ బాలికను మైనర్ బాలురిద్దరు ఇంటి వద్దనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే చిన్నారికి సాయం చేయిస్తున్న సమయంలో గాయాలు కనిపించడంతో.. ఏమైందని తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాచార నిందితుల్లో ఒకరికి 14 ఏళ్లు కాగా, మరొకరికి 8 ఏళ్లు. సెల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసిన ప్రభావంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుని వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాలిపటం ఇస్తామని ఆశచూపి బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.