శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (07:44 IST)

స్కాంట్లాండ్‌లోని అప్పిన్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థుల మృతి

road accident
స్కాట్లాండ్ దేశంలోని అప్పిన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూడో విద్యార్థి బెంగుళూరు వాసిగా గుర్తించారు. వీరంతా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన హైల్యాండ్‌లోని అప్పిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 30 యేళ్ల సుధాకర్, హైదరాబాద్‌కు చెందిన పవన్ బాశెట్టి (23)లు దుర్మరణం పాలయ్యారు. అలాగే, బెంగుళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23) అనే మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 
 
హైదరాబాద్‌కు చెందిన సాయివర్మ (14) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్కాంట్లాండ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పవన్, గిరీశ్‌లు లీసెస్టర్ యూనివర్శిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. సుధాకర్‌కు మాత్రం మాస్టర్స్ డిగ్రీ పూర్తయింది.