తోటపని చేస్తుండగా పడిన పిడుగులు, నలుగురు కూలీలు దుర్మరణం
పిడుగుపాటుకి నలుగురు కూలీలు దుర్మరణం పాలైన విషాదకర సంఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో చోటుచేసుకుంది. మంగళవార సాయంత్రం ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. చినుకులు మొదలయ్యాయి.
ఐతే కూలీ పనులు చేస్తున్న కార్మికులు మాత్రం తాము చేస్తున్న తోట పని మానలేదు. చెట్లు పీకుతూ వున్నారు. ఇంతలో భారీ శబ్దంతో పిడుగులు పడ్డాయి. వాటిలో ఒకటి కూలీలపై పడటంతో ఏడుగురు కూలీల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గుర్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడే సమయాన్ని ఇటీవల వాతావారణ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఆ హెచ్చరికలను పాటిస్తే ప్రాణాలకు ముప్పు లేకుండా సురక్షితంగా వుండవచ్చు.