గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (13:30 IST)

ఏలూరులో వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరులోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈయన తన పర్యటనను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రారంభించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. 
 
ఈ వరద బాధిత ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో సీఎం జగన్ మంగళవారం నుంచి పర్యటిస్తున్నారు. తొలుత కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన బుధవారం ఏల్లూరులో పర్యటించి వరద ముంపు బాధితులను పరామర్శించారు.